22 April, 2026 | 4:14 PM

సభా సాక్షిగా హరీశ్ రావు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొంగులేటి

18-12-2024 12:45 PM

సభా సాక్షిగా హరీశ్ రావు క్షమాపణచెప్పాలి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ నేతలు పొద్దున్నే మద్యం తాగి సభకు వస్తున్నారని, అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని హరీశ్ స్పీకర్ ను కోరారు. హరీశ్ రావు వ్యాఖ్యాలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ... హరీశ్ రావు చాలా బాధకరంగా మాట్లాడారని చెప్పారు. వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు కాదు మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడినా తప్పే అన్నారు. సభా సాక్షిగా హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.