దళారులకు ధాన్యాన్ని అమ్మి రైతులు మోసపోవద్దు: తహసీల్దార్ శ్రీకాంత్
22-04-2026 05:20 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు. బుధవారం మండలంలోని బొల్లంపల్లి, నాణ్యతండా, వేల్పుచర్ల గ్రామాలలో ఐకేపీ, ఎన్డీసీఎంఎస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.






