22 April, 2026 | 6:30 PM

ప్రధానిని అవమానించడం అంటే.. దేశ ప్రజలను అవమానించడమే

22-04-2026 05:24 PM

ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి వెంటనే భర్తరఫ్  చేయండి

బిజెపి పశ్చిమ శాఖ అధ్యక్షులు కలి కోట కమలాకర్

జవహర్ నగర్,(విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అవమానించడం దేశానికే అవమానకరమన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇటీవల తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానినీ కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పశ్చిమ శాఖ అధ్యక్షుడు కలికోట కమలాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్రావు ఆదేశాల మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ సూచన మేరకు బుధవారం బాలాజీ నగర్ ప్రధాన రహదారిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద  ఖర్గే దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పశ్చిమ శాఖ అధ్యక్షులు కమలాకర్ హాజరై మాట్లాడుతూ... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని అవమాన పరచడం దేశ ప్రజలను అవమానపరచడమేనన్నారు. ఇందుకు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని, దేశ ప్రజల మనోభావాలని గౌరవిస్తూ కాంగ్రెస్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు సంతోష్ గుప్తా, మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు, వేపుల సన్ని, ఎల్లగాని మహేష్ గౌడ్, రాజేశ్వరి, నవీన్, లక్ష్మీరెడ్డి, రాఘవేంద్ర చారి, సందీప్ ,శశాంక్ సింగ్, రాహుల్, రాజు నాయక్, సాయినాథ్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.