28 July, 2026 | 1:18 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

డ్రగ్స్ బ్లాక్ స్పాట్లపై పోలీసుల తనిఖీలు

10-02-2025 08:07 PM

నార్కోటిక్ డాగ్స్ ద్వారా గుర్తింపు

హుస్నాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు పోలీసులు నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు.  సోమవారం రాత్రి సీఐ శ్రీనివాస్  ఆధ్వర్యంలో పోలీసులు  పట్టణంలోని పలు  కిరాణాలు, బేకరీలు,  టీ స్టాళ్లు,  పాన్ డబ్బాలు తదితర అనుమానాస్పద ప్రదేశాల్లో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలున్నాయేమోనని నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీ చేశారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వాటిని అమ్మేవారితోపాటు కొనేవారిపై నిఘా పెట్టినట్టు చెప్పారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల చాక్లెట్లు కలిగి ఉన్నా, రవాణా చేసినా, ఇతరులకు అమ్మినా 100కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలన్నారు.