హైదరాబాద్ రౌడీషీటర్లకు డ్రగ్ పరీక్షలు
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు శుక్రవారం నాడు కీలక ఆపరేషన్(Hyderabad Police's Key Operation) చేపట్టారు. నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీపీ సజ్జనార్ ఆదేశాలతో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు చేశారు. హైదరాబాద్ లో ప్రస్తుతం 1300 మంది పైగా రౌడీ షీటర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.
నగరంలో 250 మందికి హెచ్ న్యూ పోలీసులు(H-New Police) డ్రగ్ టెస్టులు(Drug Tests) నిర్వహించగా, అందులో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. గంజాయి సరఫరాదారులపైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. రౌడీషీటర్లు ఎక్కువగా గంజాయికి అలవాటు పడినట్లు తెలుస్తోంది. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) ఆరా తీస్తున్నారు.




