10 April, 2026 | 3:44 AM

ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాడి టోకరా

10-04-2026 01:56 AM
  1. కేంద్ర ప్రభుత్వ పథకంతో యువతకు 10 లక్షల చొప్పున రుణం అంటూ బురిడీ

ఈ నెల 5న ఫోన్..

నమ్మి నియోజకవర్గ యువత కోసం రూ.లక్ష ఫోన్ పే

చివరికి మోసం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు

జనగామ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సైబర్ నేరగాళ్లు టోకరా ఇచ్చారు. ఆయనను నమ్మించి రూ.లక్ష కొట్టేశాడు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను కేంద్ర ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీనంటూ పరిచయం చేసుకున్నాడు. ఓ కేం ద్ర ప్రభుత్వ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రూ.10 లక్షల వరకు రుణా లు ఇచ్చే అవకాశం ఉన్నదని ఎమ్మెల్యేకు వివరించాడు.

దీనికిగాను ఒక్కొక్కరికీ రూ.2,500 చెల్లించాలని, దరఖాస్తుకు ఈరోజే చివరితేదీ అని నమ్మబలికాడు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన నియోజకవర్గంలోని యువతకు ఉపయోగపడుతుం దనే ఉద్దేశంతో సదరు అపరిచిత వ్యక్తి చె ప్పిన ఖాతాకు 40 మంది కోసం రూ.లక్ష తన భార్య మొబైల్ నుంచి ఫోన్ పే చేశా రు. అనంతరం ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు వచ్చాయా? అని ఎమ్మెల్యే ఆరా తీశారు.

సదరు అధికారి డబ్బులు రాలేదని చెప్పడంతోపాటు అసలు తాను ఫోన్ చేయలేదని తెలిపినట్టు పల్లా పేర్కొన్నారు. చివరికి తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుచేశారు.