ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు
21-04-2026 04:28 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద తండాకు చెందిన హారిక మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్లో 970 మార్కులు సాధించిన సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల ఎస్సై భార్గవ్ గౌడ్, పోలీస్ సిబ్బంది శాలువతో ఘనంగా సన్మానించారు. హారిక పూరిగుడిసెలో నివసిస్తూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చదువుకోవాలని పట్టుదలతో మండలంలోనే టాపర్గా నిలిచి ఆదర్శమయ్యారు.
మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై భార్గవ్ గౌడ్, పోలీస్ సిబ్బంది అభినందించారు.మండల్ టాపర్ హారికకు ఉద్యోగం వచ్చేవరకు చదువుకు సంబంధించిన ఖర్చులను తాము భరిస్తామని ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఎంట్రన్స్ పరీక్షలకు అప్లై చేసుకోవడానికి రూ.3000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.






