అంగన్వాడీలో పోషక అభియాన్
21-04-2026 04:31 PM
బైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో పోషక అభియాన్ నిర్వహించారు. పిల్లలకు పోషక ఆహారంపై గ్రామ సర్పంచ్ కట్ట రవి అవగాహన కల్పించి పంపిణీ చేశారు. ప్రతినెల పోషకాహారాన్ని అందించి పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గజ్జరం అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.






