18 May, 2026 | 4:26 AM

పోగొట్టుకున్న బ్యాగు అప్పగించిన పోలీసులు

18-05-2026 12:00 AM

కూకట్‌పల్లి, మే 17 (విజయక్రాంతి): కేపిహెచ్‌బీ కాలనీ బస్టాండ్ వద్ద ఓ మహిళా ప్రయాణికురాలు నగదు, బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును పోగొట్టుకున్న సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లికి చెందిన వైఎస్ రాజేశ్వరి(60) చందానగర్‌లో పూజ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కేపీహెచ్‌బీ బస్టాండ్‌కు వచ్చారు.

లగేజ్‌ని తీసుకెళ్లే క్రమంలో హ్యాండ్‌బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయి 20 నిమిషాల తర్వాత బ్యాగ్ మరిచిపోయామని గమనించారు. బ్యాగ్‌లో 25 వేల నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు ఉన్నట్లు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సీసీఫుటేజీల ఆధారంగా రెండు గంటల్లోనే పోగొట్టుకున్న బ్యాగును బాధితురాలు రాజేశ్వరికి తిరిగి అప్పగించారు.