కేబుల్ బ్రిడ్జిపై కారు బీభత్సం
ఇద్దరికి తీవ్ర గాయాలు
శేరిలింగంపల్లి, మే 17 (విజయక్రాంతి): మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం ఉదయం 5 నుంచి 5:30 గంటల మధ్య కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు గాయపడ్డారు. విగ్నేష్(24), స్నేహితురాలు భవిష్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. డ్రైవర్ స్నేహితుడు వెనక్కి తిరిగి చూడటంతో కారు అదుపు తప్పినట్లు సమాచారం. గాయపడిన ఇద్దరికీ చికిత్స అందించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. కారు నడిపిన ఖాజాకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విగ్నేష్ బావమరిది చెన్న కేశవులు సాయంత్రం 5 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం వేళల్లో బ్రిడ్జిలపై వేగంగా వాహనాలు నడపడంతోనే ప్రమాదాలకు కారణ మవుతున్నాయని పోలీసులు తెలిపారు.






