24 June, 2026 | 10:58 PM

సిరిసిల్లలో పోలీస్ జాబ్ మేళా

14-06-2024 01:44 AM

ప్రారంభించిన ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, జూన్ 13(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణ కేంద్రంలో గురువారం  పోలీసుల ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1,000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహించిన ఎస్పీ, పోలీస్ యంత్రాగాన్ని ఆది శ్రీనివాస్ అభినందించారు. జాబ్ మేళాకు పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8,000 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన కంనెనీల నిర్వాహకులు ఎంపికైన వారికి నియామకపత్రాలను అందజేశారు. అనంతరం అనంతరం విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డ్రగ్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, యువత ఉద్యోగ అవకాశాలని అందిపుచుకోవాలని కోరారు.