24 June, 2026 | 9:48 PM

గుట్టుచప్పుడు కాకుండా గుట్కా దందా

14-06-2024 01:45 AM
  • వరంగల్ నగరంలో ‘బ్లాక్’ లో విక్రయాలు

చూసీచూడనట్లు వదిలేస్తున్న పోలీస్‌శాఖ

హనుమకొండ, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో గుట్కా అనే మాట వినపడొద్దని, గుట్కా విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని గత నెల 24న రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుట్కా విక్రయించేవారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌శాఖను ఆదేశించింది. కానీ వరంగల్‌కు చెందిన కొందరు అక్రమార్కులు ఆ దేశాలను ఖాతరు చేయడం లేదు. వారు హైదరాబాద్‌లోని సీక్రెట్ డంప్ నుం చి పెద్ద మొత్తంలో గుట్కా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారని తెలిసింది. అక్కడి నుంచి ఇక్కడికి సరుకు తెచ్చి బ్లాక్ మార్కెట్‌లో అధిక రేటుకు వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్?

గుట్కా ఉత్పత్తులు విక్రయించేవారిపై ఉక్కుపాదం రాష్ట్రప్రభుత్వం పోలీస్‌శాఖను ఆదేశించింది. పోలీసులు మాత్రం నామమాత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులు పుకొంటున్నట్లు విమర్శలున్నాయి. వరంగల్ నగరంలోని పిన్నవారి వీధి, బట్టల బజార్, బీట్ బజార్‌లోని హోల్‌సేల్ కిరాణ షాపుల్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయా లు కొనసాగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. వరంగల్ నగర శివారుల్లోని కొన్ని గోదాముల్లో వ్యాపారులు పొగాకు ఉత్పత్తులను డంప్ చేసి అక్రమంగా వ్యాపారం కొన సాగిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.

బ్లాక్‌లో విక్రయాలు..

పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించడం పలువురు వ్యాపారులకు కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. నిషేధం నాటికే పెద్ద మొత్తంలో గుట్కా ఉత్పత్తులను నిల్వ చేసుకున్న వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా చిన్నవ్యాపారుల డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహ రిస్తుండటంతోనే దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భారీగా గుట్కా ప్యాకెట్ల సాధీనం

ఆదిలాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గుట్కా ప్యాకె ట్లను పట్టుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడిం చారు. బుధవారం రాత్రి ఆదరనగర్ లోని అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కిరాయికి తీసుకుని గుట్కాను నిలువ ఉంచారనే పక్క సమాచారంతో దాడి చేసినట్లు తెలి పారు. రూ.3,15,150 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. ముగ్గురు నిందితుల్లో షేక్ అఫ్సర్‌ను అరెస్ట్ చేయగా, అక్రం, మన్సూర్  పరారీలో ఉన్నట్లు వెల్లడిం చారు. సమావేశంలో రూరల్ సీఐ ఫణిధర్, ఎస్‌ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.