08-11-2025 08:11:27 PM
జహీరాబాద్ టౌన్: పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్ళను పోలీసులు అరెస్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు చిన్న హైదరాబాద్ గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.40,150 నగదు, 4 మోటార్ సైకిళ్లు, 14 సెల్‌ఫోన్లు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ కె. వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.