08-11-2025 08:09:32 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపల్ అన్నోజిగూడలో శ్రీజగదంబ మాత, సంత్ సేవాలాల్ మహారాజ్ నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈమేరకు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం రక్షాబంధనం, పంచగవ్యప్రాశనం, ఋత్విక్ వరణం, ప్రతిష్ట సంకల్పం, దీక్షధారన, మంటపారాధన, అఖండ దీపస్థావన, అగ్నిప్రతిష్టాపనం, గణపతి హోమం, సాయంత్ర 6 గంటలకు విగ్రహాల ఊరేగింపు, మంగళహారతి, తీర్థ ప్రసాదవితరణ వేధ పండితుల, తండా పెద్దల సమక్షంలో వైభవంగా నిర్వహించారు.
ఈ మేరకు రవీందర్ రెడ్డి, బీజేపీ గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గం సభ్యులు ననావత్ బిక్కునాథ్ నాయక్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ననావత్ రెడ్యా నాయక్, ఆలయ కమిటీ పెద్దలు సభ్యులు జితేందర్ నాయక్, తౌర్య నాయక్, నాయక్ రాంసింగ్, తారాసింగ్, రమేష్ నాయక్, జగన్ నాయక్, వి. రాంసింగ్ నాయక్, గుగులోత్ గోవింద్ నాయక్, చరణ్ నాయక్, రూప్ సింగ్ నాయక్, ననావల్ సీతారం నాయక్ కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.