హోలీ సందర్భంగా పోలీసుల ఆంక్షలు.. అతిక్రమిస్తే తప్పవు తిప్పలు
14-03-2025 08:52 AM
హైదరాబాద్: హోలీ పండగ(Holi festival) సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లో పోలీసులు కఠిన ఆంక్షలు(Police restrictions) విధించారు. శుక్రవారం ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పోలీసుల ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు కూడా బంద్ చేయబడ్డాయి. రోడ్లపై గుంపులుగా తిరుగొద్దంటూ పోలీసులు(Police warnings) హెచ్చరించారు. వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నింబంధనలుఅతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు వెల్లడించారు.






