17 March, 2026 | 3:51 AM

కానిస్టేబుల్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

17-03-2026 02:38 AM

ఉప్పల్, మార్చి ౧౬ (విజయక్రాంతి): ఉప్పల్ చిలకనగర్‌లోని ఏ ఆర్ కానిస్టేబుల్ హత్య కేసును  6 గంటల వ్యవధిలోనే ఉప్పల్ పోలీసులు ఛేదించి, హత్యకు పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.  ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన ప్రకారం..  చిలకనగర్ చెందిన సుధీర్‌కుమార్ (38) హైదరాబాద్ సిటీ పోలీస్ సీడబ్ల్యూసీ ఏఆర్ కానిస్టేబుల్‌గా  పని చేస్తున్నాడు.

ఉప్పల్ చెందిన సంతోష్ (28) వృత్తి రీత్యా  రాపిడో డ్రైవర్   సుధీర్ సంతోష్  దగ్గరి స్నేహితులు వీరిద్దరూ తరచూ కలిసి మద్యం సేవించేవారు. ఇటీవల కాలంలో సుధీర్ బావ గృహప్రవేశానికి సంతోష్‌ను ఆహ్వానించారు. సంతోష్ వ్యక్తిగత కారణాలవల్ల సుధీర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫంక్షన్ కూడా హాజరు కాకపోవడంతో  సుధీర్ సంతోష్ పై కోపం పెంచుకున్నాడు. అప్పటినుండి సుధీర్, సంతోష్ ఫోన్‌లో వాదోపవాదాలకు దిగేవారు.

సంతోష్ సుధీర్‌కి ఫోన్ చేసి  మాట్లాడుకుందామని చిలకా నగర్ గ్రౌండ్ వద్దకి రమ్మన్నాడు. దీంతో సుధీర్ తన స్నేహితుడైన  ఇమ్రాన్‌తో కలిసి అక్కడికి వెళ్ళాడు. మద్యం మత్తులో ఉన్న వీరు ఒకరిపై ఒకరు అసభ్య పదజాలం ఉపయోగించుకుంటూ గొడవకు దిగారు. దీంతో ఒకసారిగా సంతోష్ చాకుతో సుధీర్‌పై దాడికి దిగాడు. సుధీర్ పారిపోతున్నప్పటికీ సంతోష్ తన వెంట ఉన్న తరుణ్  ఇద్దరు వెంబడిస్తూ  సుధీర్‌ని అతి దారుణం గా హతమార్చారు.

శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకునే సుధీర్ మృతి చెందాడు. దీంతో తన బామ్మర్ది సుధీర్‌ని హత్యకు పాల్పడినవారి   శ్రీకాంత్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించారు. 6 గంటల వ్యవధిలోనే  హత్య కేసు చేదించిన ఉప్పల పోలీసులను డీసీపీ అభినందించారు.