22-02-2026 01:32:19 AM
1957 నుంచి దాదాపు ఇప్పటి వరకు ఎంపీగా 15 సార్లు ఓసీలే గెలుపు 1996, 2009, 2019, 2024లో బీసీలు విజయం
ఎన్నికల్లో పట్టుసాధిస్తున్న బ్యాక్‌వార్డు క్లాసెస్ నేతలు
మున్సిపల్ ఎన్నికల్లోనూ 50శాగానికి పైగా కార్పొరేటర్లు గెలుపు
బీసీ బలంతోనే కార్పొరేషన్‌పై ఎగిరిన కాషాయ జెండా
కరీంనగర్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు
కరీంనగర్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఒకప్పుడు అగ్రవర్ణాల ఆధిపత్యానికి ప్రతీక గా నిలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు కొన్ని సా మాజిక వర్గాలకే పరిమితమైన నాయకత్వం, కాలక్రమేణా బీసీ వర్గాల్లో పెరిగిన రాజకీయ చైతన్యంతో కొత్త దిశగా పయని స్తోంది. ఓసీ గడ్డగా పేరుగాంచిన ఈ ప్రాంత ంలో బీసీ నినాదం బలపడుతూ, సంప్రదా య సమీకరణాలను సవాలు చేస్తోంది.
1957లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1991 వరకు ప్రధానంగా వెలమ సామాజిక వర్గానికి చెం దిన నాయకులే విజయం సాధిస్తూ వచ్చా రు. 1998 నుంచి 2009 వరకు కూడా అదే వర్గం ఆధిపత్యం కొనసాగింది. అయితే 1996 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణ టీడీపీ తరఫున గెలుపొందడం రాజకీయంగా కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొన సాగుతున్న రమణ జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2009 నుంచి 2021 వరకు కొనసాగారు. ప్రస్తుతం ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నారు.
అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన 2023లో హుస్నాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్ వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నా రు.
గతంలో భారీ మెజార్టీతో గెలిచిన కే చంద్రశేఖర్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్ రికార్డులను బ్రేక్ చేశారు. బండి సంజ య్ రాకతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీసీ నినాదం మరింత బలపడింది. బండి సంజయ్ 2020 మార్చి నుంచి 2023 జూలై 4వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. జూలై 8న ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితుడ య్యారు. 2023 జులై 29న బీజేపీ అధిష్ఠానం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా నియమించింది.
ఇదే ప్రభావం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కనిపించింది. 50 శాతం పైగా బీసీ వర్గాలకు చెందిన కార్పొరేటర్లు గెలుపొందడం, కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయడంలో కీలక పా త్ర పోషించడం రాజకీయ మార్పుకు సంకేతంగా మారింది. కమలాపూర్, హుజూరా బాద్ ప్రాంతం ఒకప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోటగా భావించబడేది. అలాంటి ప్రాంతంలో 2004లో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిని ఓడించి ఈటల రాజేందర్ సంచలనం సృష్టించారు. 2008 ఉపఎన్నికల్లో తిరిగి గెలిచి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. 2009, 2010 ఉపఎన్నికలు, 2014, 2019 ఎన్నికల్లో వరుస విజ యాలు సాధించారు. 2021లో బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున ఉపఎన్నికల్లో గెలిచారు.
2023 అసెంబ్లీ ఎన్ని కల్లో ఓటమి పాలైనా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచి తన రాజకీ య స్థైర్యాన్ని మరోసారి నిరూపించారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కూ డా వెలమల కంచుకోటగా పేరుగాంచింది. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ విజయం సాధించి, ఆ కంచుకోటను బద్దలు కొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. గంగుల 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఉద్యమ సమయంలో టీడీపీకి రాజీనామా చేసి 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కమలాకర్ 2014, 2018, 2023లో గెలుపొందా రు. 2019లో కెసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కమలాకర్ కరింనగర్ అసెంబ్లీ గడ్డ పై బీసీ జెండా ఎగరేయడమే కాకుండా 4సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. మొత్తంగా చూస్తే కరీంనగర్ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. బీసీ వర్గాల్లో పెరుగుతున్న చైతన్యం సంప్రదాయ ఆధిపత్యాలకు సవాల్ విసురుతోంది.