30 June, 2026 | 8:59 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఉక్కుపాదం

21-03-2026 12:17 AM
  1. రూ.4,750 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం

ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మెదక్, మార్చి 20(విజయ క్రాంతి) :మెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలం సిలంపల్లి గ్రామ శివారులోని డంప్యార్డు సమీపంలో అక్రమంగా జూ దం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని జూదం ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిలో వెంకటాపురం లక్ష్మణ్, జుకంటి లోకయ్య, మన్నె ప్రసాద్, యల్లయ్యగారి భూమ్ రెడ్డి ఉన్నారు. ఈ ఘటనలో రాకేష్, పెద్దొల్ల సుధాకర్ రెడ్డి పరారీలో ఉండగా, సంఘటనా స్థలం నుండి రూ.4,750 నగదు మరియు 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చిల్పిచేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.