30 June, 2026 | 9:50 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

విద్యార్థులకు మెనూను తప్పక అమలు చేయాలి

21-03-2026 12:19 AM

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్ 

మెదక్, మార్చి 20(విజయ క్రాంతి) :విద్యార్థులకు మెనూ ను తప్పక అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. శుక్రవారం టేక్మల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవకేంద్రాన్ని ,గ్యాస్ గోదామును పరిశీలించారు. కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కేజీవీబీ పాఠశాలలో స్టోర్ రూమును,కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. కేజీవీబీ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెనూ తప్పక అమలు చేయాలన్నారు. విద్యార్థులకు నా ణ్యమైన భోజనం, ఉచిత విద్యా, అందించాలని తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆగ్రో సేవకేంద్రం లో పలు రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు. రైతులకు అన్ని మందులు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, యూరియాను త్వరిత గతిన అందించాలన్నారు.

గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సమస్యపై చింతించాల్సిన అవసరం లేదన్నారు.జిల్లా లో సరిపడ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్నారు. గ్యాస్ సమస్యను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.