మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు
చేగుంట, మార్చి 15 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింసోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందుఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం లోని వడియారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నదీమ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టినలముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి, ఉపవాస దీక్ష విడిపించారు.
ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని , రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు, అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సమానమని, సమాజంలో సోదర భావంతో కలిగి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాడేం వెంగలరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, బల్ రెడ్డి,మొహమ్మద్ నదీమ్ హాసేన అలీ, వాసీం, అర్భాజ్, తంసియిన్, ఎజాజ్,మోహన్ నాయక్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు,వార్డ్ మెంబెర్స్ సినియర్ నాయకులు పాల్గొన్నారు.




