స్టేషన్‌లో కేసుల విత్‌డ్రా?
- పలు పోలీస్ స్టేషన్ వేదికగా రాజీ రాజకీయాలా?
- కేసులు పెట్టుకున్నది ఒకరిపై ఒకరు..విత్‌డ్రా చేయించేది మరొకరితోనా?
అక్టోబర్ 4(విజయక్రాంతి): ప్రజలకు న్యాయం అందించాల్సిన పోలీసు వ్యవస్థలో(Police System) రాజకీయ జోక్యం(Political interference) ఎంతవరకు ఉండాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నా యి. నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని మొక్కే పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుండ గా. మరోవైపు పలు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను రాజకీయ ఒత్తిళ్లతో ఉపసంహ రించు కుంటున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.చిన్నచిన్న వివాదాలకే సామాన్యులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు..
రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల విషయంలో మాత్రం రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న నాయకులు..అనంతరం రాజీ కోసం ప్రయత్నించడం,కేసుల ఉపసంహరణ కు పోలీస్ స్టేషన్లు వేదికగా మారడం పట్ల పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇటీవల ఇద్దరు రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ లైవ్ వీడియోల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్న వ్యవహారం కూడా చర్చకు దారితీసింది.
ఒకే పార్టీలో ఉన్న నేతల మధ్య వివాదం పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించే పరిస్థితి ఏర్పడటం తో..పెద్దల జోక్యంతో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఉపసంహరించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టం అందరికీ సమానమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
కేసు నమోదైన అనంతరం దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగాల్సిన సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసులను ఉపసంహరించు కుంటున్నారనే ఆరోపణలు నిజమైతే.. అది పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పరిణామంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నా రు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి.కేసుల నమోదు నుంచి ఉపసంహరణ వరకు జరిగిన పరిణామాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.