పాత కక్షలతో రాజకీయ నాయకుడి హత్య
హనుమకొండ, జూలై 26 (విజయక్రాంతి): పాత రాజకీయ కక్షలతో, తన పై తప్పుడు ప్రచారం తన రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని నేపంతో కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్ ను ఎనమాముల ప్రాంతానికి చెందిన పట్టి కుమార స్వామి అతని మిత్రులతో కలిసి హత్య చేశాడనీ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.
ఆదివారం హనుమకొండ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్. శ్వేత మాట్లాడుతూ గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడుప మహేష్ హత్యకు సంబం ధించిన వివరాలను వెల్లడించారు. మృతుడు అడుప మహేష్ సహచర కాంగ్రెస్ కార్యకర్త పట్టి కుమారస్వామి అతని మిత్రులతో కలిసి మాట్లాడుకుందాం రా అని పిలిచి పె ట్రోల్ పోసి నిప్పంటించారని, అనంతరం మృతుడు ఇంటికి వెళ్లి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశాడని, కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం కి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందాడు అన్నారు.
సంఘటనపై గీసుగొండ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు చేసిన కేసు దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరగా పట్టుకొనేందుకుగాను ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి ఈ హత్యకు పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ కేసులో దర్యాప్తుగా వేగంగా పూర్తి చేసి న్యాయస్థానం ద్వారా నిందితులకు శిక్షపడే విధంగా చర్యలు తీసుకొవడం జరుగుతుందన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసిపి వెంకట్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్సె్పక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్ తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.






