17 April, 2026 | 3:13 AM

మాగంటి అనారోగ్యంపై రాజకీయం తగదు

07-06-2025 01:48 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని  మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందని, అయితే ప్రభుత్వ కార్యక్రమాల బిజీ షెడ్యూల్‌తో ఆయనను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లలేకపోయినట్టు తెలిపారు.

శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని, బీఆర్‌ఎస్ నాయకులు మా త్రం మాగంటి అనారోగ్యాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.

బోరబండలో బీఆర్‌ఎస్ కార్యకర్త సర్దార్ ఆత్మహత్యను కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్‌కు  ఆపాదిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు కక్ష సాధిస్తున్నారని మంత్రి ఆరోపించారు. సర్దార్ మరణంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.