calender_icon.png 7 June, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో డీఏను ఆగస్టులోనే చెల్లించాలి

07-06-2025 01:50:38 AM

టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర క్యాబినెట్ సమవేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉపాధ్యాయలోకాన్ని పూర్తిస్థాయిలో సంతృప్తి పర్చలేకపోయాయ ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొముర య్య పేర్కొన్నారు. రెండో డీఏను ఆగస్టులో నే చెల్లించాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు డీఏలు ఇ స్తామని చెప్పినా..రెండో డీఏ ఆరు నెలల త ర్వాత ఇస్తామనడం సరికాదన్నారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడం, హెల్త్‌కేర్ ట్రస్ట్ ఏర్పా టు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొ న్నారు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మరో డీఏ మంజూ రు చేసే అవకాశముందని వెల్లడించారు. ఈక్రమంలో రెండో డీఏను ఆరు నెలల త ర్వాత కాకుండా ఆగస్టులోనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.