11 May, 2026 | 9:43 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి

11-05-2026 09:01 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET), తెలంగాణ, హైదరాబాద్* ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షను నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13 ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ కోఆర్డినేటింగ్ కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన బెల్లంపల్లి కోఆర్డినేటర్ డా. దేవేందర్ వెల్లడించారు.

- బెల్లంపల్లి కోఆర్డినేటింగ్ కేంద్రం..

3001 – ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), బెల్లంపల్లి – 343 మంది

3002 – ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు), బెల్లంపల్లి – 408 మంది

3006 – జెడ్పీహెచ్‌ఎస్ బజార్ ఏరియా, బెల్లంపల్లి – 240 మంది

3008 – జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు), బెల్లంపల్లి – 180 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మొత్తం విద్యార్ధులు  1171  కాగా ఇందులో బాలురు  619 మంది, బాలికలు 552 మంది.

 - మంచిర్యాల కోఆర్డినేటింగ్ కేంద్రం..

3301 – సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ [బ్లాక్-A] – 571 మంది

3304 – ప్రభుత్వ డిగ్రీ కళాశాల – 288 మంది,3305 – జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల – 240 మంది

3307 – ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చెన్నూర్ రోడ్, సాయికుంట – 192 మంది

3309 – జెడ్పీహెచ్‌ఎస్ బాలికలు, మంచిర్యాల – 264 మంది

3310 – ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గర్మిళ్ల – 192 మంది

3317 – శ్రీ చైతన్య హై స్కూల్ – 480 మంది

3318 – అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ – 137 మంది మొత్తం పరీక్షార్థులు 2364 మంది బాలురు 1257 మంది, బాలికలు 1107 మంది.

- ఆసిఫాబాద్ కోఆర్డినేటింగ్ కేంద్రం..

5005 – ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళా), బెండారా, ఆసిఫాబాద్ – 252 మంది

5004 – మాతృశ్రీ డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ – 240 మంది

5002 – తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కళాశాల (బాలురు), ఆసిఫాబాద్ – 332 మంది

5010 – తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కళాశాల (బాలికలు), ఆసిఫాబాద్ – 240 మంది

మొత్తం పరీక్షార్థులు  1064 మంది. విద్యార్థులు ఉదయం 10.00 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, 11.00 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా హాల్లోకి అనుమతించబడరనీ తెలిపారు. హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. బ్లూ/బ్లాక్ పెన్, హెచ్‌బీ పెన్సిల్, రబ్బరు వెంట తీసుకురావాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధించబడ్డాయి. ఓఎంఆర్ షీట్‌లో హెచ్‌బీ పెన్సిల్‌తోనే బబుల్స్ నింపాలి. పరీక్ష పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1.30 గంటల వరకు హాల్ విడిచి వెళ్లరాదు. పరీక్షా సిబ్బందికి సహకరించి క్రమశిక్షణ పాటించాలనీ కోరారు.

విద్యార్థులందరూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై, ఎస్‌బీటీఈటీ జారీ చేసిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  సూచించారు.