నేడు పాలీసెట్
24-05-2024 01:37 AM
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాలీటెక్నిక్ ఎంట్రెన్స్ (పాలీసెట్) పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని ఈమేరకు అధికారులు సూచిం చారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్ప టికే పూర్తిచేశారు. రాష్ట్రంలో మూడే ళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ పాలీటెక్నిక్ ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు మొత్తం 92,808 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 259 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.






