ప్రభుత్వ బధిరుల పాఠశాలలో అడ్మిషన్లకు ఆహ్వానం
24-05-2024 01:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి) : మలక్‌పేటలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల (చెవిటి) అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రధానో పాధ్యాయులు గురువారం తెలిపారు. పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు పొందవచ్చన్నారు. ఈ పాఠశాలలో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, ఉచిత భోజనం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ తో పాటు ప్రభుత్వం అందజేయు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాఠశాలలో చేరేందుకు 94403 62946, 9490942597 నెంబర్లను సంప్రదించాలన్నారు.






