30 May, 2026 | 2:30 AM

పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం

30-05-2026 01:20 AM

నంగునూరు, మే 29:మండల పరిధిలోని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైంది.మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు స్లాట్ విధానంలో ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లపై అవగాహన కల్పిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎ. గోవర్ధన్ తెలిపారు.

తొలిరోజు 192 మంది విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు.విద్యార్థుల సౌకర్యార్థం సిద్ధిపేట జిల్లాలోని రాజగోపాలపేట, చిన్నకోడూరు, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమన్వయకర్త అలుగోజు గోవర్ధన్ నేతృత్వంలో, బి. అభినవ్ పర్యవేక్షణలో సిబ్బంది ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.