వృధాగా పోతున్న తాగునీటిని ఆపరా!
30-05-2026 01:22 AM
గుమ్మడిదల, మే 29 : ఎండాకాలంలో ఎక్కడ చూసినా తాగునీటి కొరత నెలకొనగా... కానీ గుమ్మడిదల మున్సిపాలిటీలో మాత్రం తాగునీరు వృధాగా పోతున్నా ఆపేవారు కరువయ్యారు. గుమ్మడిదల మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా మున్సిపల్ పాలకవర్గం తగిన చర్యలు తీసుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం 24 గంటలు నీరు వృధా అవుతుంది. బొంతపల్లి 20వ వార్డులో ఉన్న మంచినీటి ట్యాంకుకు నీరు పైకి పంపించడానికి ఏర్పాటు చేసిన పైపు లైన్ తో పాటు ఓవర్ ఫ్లోయింగ్ ఏర్పాటు చేసిన పైపు ద్వారా నీరు వృధాగా పోతుందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






