calender_icon.png 7 August, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా సీట్ల భర్తీ

07-08-2025 10:55:52 AM

 సివిల్ ఇంజినీరింగ్: 29 సీట్లు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 2 సీట్లు

నాగార్జునసాగర్, విజయక్రాంతి: టీజీ పాలిసెట్‌-2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా స్పాట్‌ అడ్మిషన్ల‌(Spot admissions) ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి నాగార్జునసాగర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్‌ ఐలయ్య‌ తెలిపారు.  అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు: సివిల్ ఇంజినీరింగ్: 29 సీట్లు.ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 2 సీట్లు తేదీలు:స్పాట్ అడ్మిషన్ దరఖాస్తులు: 05-08-2025 నుండి 10-08-2025 వరకు స్వీకరించబడును.స్పాట్ అడ్మిషన్ జరుగు తేదీ : 11-08-2025 సీట్ల సంఖ్య పరిమితంగా ఉంది. అందువల్ల, ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. టీజీ పాలిసెట్‌-2025లో అర్హత పొందిన, పొందని విద్యార్థులు ఇద్దరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని, అభ్యర్థులు తప్పనిసరిగా తగిన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.మరింత వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9491398142, 9052571315 చిరునామా: గవర్నమెంట్ పాలిటెక్నిక్, నాగార్జునసాగర్, నల్గొండ జిల్లా, తెలంగాణ.ప్రిన్సిపాల్ ,గవర్నమెంట్ పాలిటెక్నిక్, నాగార్జునసాగర్