07-08-2025 10:53:35 AM
ఘట్ కేసర్: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీలో ఈ నెల 5,6,7వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ లకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో ఉమ్మడి ఘట్ కేసర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి అక్కడ పలువురు తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో మేడ్చల్ బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ముల్లి జంగయ్య యాదవ్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకట్ నారాయణ, రాజేందర్, భరత్, ప్రవీణ్, బానుచందర్, అరవింద్ రెడ్డి, కార్తీక్, నర్సింగ్, శ్రీరామ్, ఉన్నారు.