03-11-2025 12:32:24 PM
మల్యాల, (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) నివాసానికి వెళ్లి ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొడిమ్యాల మండల హిమ్మత్ రావు పేట్ తాజా మాజీ సర్పంచ్ పొనుగోటి కృష్ణారావు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామడుగు మండల సింగల్ విండో చైర్మన్, తన్నీరు సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.