27 February, 2026 | 4:58 PM

Breaking News

మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి   •   పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి   •   రైతు భరోసాపై స్పష్టమైన ప్రకటన చేయాలి   •   రక్తదానం చేసి ప్రాణ రక్షకుడు యువకుడు   •   విబి బెంగుళూరు అయ్యంగార్ బేకరి, స్వీట్ హౌస్ ను ప్రారంభించిన శ్రీను బాబు   •   రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి   •   చేవెళ్లకు బదిలీ అయిన ఆర్డీఓకు ఘన సత్కారం   •   గృహ ప్రవేశ మహోత్సవంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •  

పేదల పాలిట ఆపద్బాంధవుడు డాక్టర్ సంపత్ కుమార్

27-02-2026 03:02 PM

పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం

తాండూరు,(విజయక్రాంతి): నిరుపేదలకు ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ బాలాజీ నర్సింగ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్. శుక్రవారం తాండూర్ మండలం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన బుడిగజంగం లింగమ్మ అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క అంతక్రియలకు డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.

మరోవైపు పాత తాండూరు 16వ వార్డు కు చెందిన నీరటి రాము అనే వ్యక్తి మృతి చెందిన విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆయన మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పేదింటి కుటుంబ పెద్ద మృతి చెంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ నిరుపేద కుటుంబాలకు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్, ఆర్థిక సహాయం అందించడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ భాస్కర్, అమ్రేష్ ముదిరాజ్, సంగం శీను, లాలప్ప, మొగులప్ప, వెంకట్, రమేష్,గుండు,బద్రి, అజంతా, దేవప్ప సురేష్,గణేష్  పాత తాండూర్ కు చెందిన ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.