calender_icon.png 3 November, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా సిద్దిపేటలో సదర్ సయ్యాట

03-11-2025 12:30:09 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని 17వ వార్డు వివేకానంద కాలనీ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సయ్యాట(Sadar Festival) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన దున్నలు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాదవ సంఘం నాయకులు, కుల సంఘ సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

యాదవ సంఘం యువ అధ్యక్షులుగా దాసరి నరేష్ యాదవ్, దాసరి పరమేష్ యాదవ్, సమన్వయం వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో గొల్ల సుద్దుల ఆటలు, మహిళల నాట్య ప్రదర్శనలు, సదర్ సయ్యాటలో భాగంగా జరిగిన ఆటపాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రధాన అతిథిగా వంగ రాజేశ్వర్ రెడ్డి హాజరై సాంస్కృతిక వైభవాన్ని అభినందించారు. కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సందడిని మరింత పెంచారు.