calender_icon.png 8 November, 2025 | 9:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

08-11-2025 08:08:48 PM

కరీంనగర్ (విజయక్రాంతి): జిల్లాలోని అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీఎనీవో జిల్లా అధ్యక్షుడు వారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం అంగన్వాడి ఉద్యోగులు టీఎన్బీవో నాయకులకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకుకువెళ్లామని పేర్కొన్నారు. అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపు కలెక్టర్ అనుమతితో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, నాల్గవ తరగతి సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, అంగన్వాడి ఉదోయగులు ఏరువా లలితా రెడ్డి, స్వరూప, భాగ్యలక్ష్మి, లక్ష్మి, రమణారెడ్డి, స్వరూప, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.