07-06-2025 08:28:20 PM
కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధిలోని చెన్నూరు వైద్యశాల(Chennur Hospital)కు నూతన వైద్యులుగా కొర్రపాటి ప్రత్యూష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో వైద్యాధికారిణి తబస్సుమ్ తీసుకున్నారు. యం.డి ఎనాస్తిషియా ప్రత్యేక వైద్యులుగా చెన్నూరుకు రెండవ పోస్ట్ మంజూరు కావడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైద్యురాలికి పుష్పగుచం ఇచ్చి స్వాగతం పలికిన వైద్య సిబ్బంది, ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీకర్, పల్లె దవఖాన వైద్యులు, ఏ.యన్.యంలు,ఆశ సిబ్బంది పాల్గొన్నారు.