03-07-2025 12:00:00 AM
గద్వాల, జులై 2 (విజయక్రాంతి): పీఎం కిషాన్ పేరిట వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేసి ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న ఘటన గట్టు మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కేటి మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు మండల కేంద్రానికి చెందిన కత్రి లక్ష్మణ్ కు గుర్తు తెలియని వ్యక్తులు పీఎం కిషాన్ డబ్బులు జమ కావాలంటే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించాడు. ఖాతాదారుడి వాట్సాప్ కు ఓ లింక్ పంపాడు.
లక్ష్మణ్ దాన్ని క్లిక్ చేయగా ఆధార్ అనుసంధానం మెసేజ్ వచ్చింది. దీంతో ఆధార్ నంబర్ను లింక్ చేశాడు. ఆతర్వాత స్టేట్ బ్యాంక్ అప్ ఇండియా ఖాతా నుంచి రూ.,64,500 డెబి ట్ అయినట్లు బాదితుడి సెల్బ కు మెసేజ్ వచ్చింది. తన డబ్బును సైబర్ నేర గాళ్లు తస్కరించారని గ్రహించిన లక్ణ్మణ్ బుధవారం గట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.