calender_icon.png 18 July, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులే నా తొలి ఆస్తి

18-07-2025 12:19:47 AM

-విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

హుజూరాబాద్,జూలై17: (విజయ క్రాంతి)పేద విద్యార్థుల విద్యా ప్రయాణంలో తొలి మైలురాయిగా సైకిళ్లు మారుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ పట్టణంలోని స్థా నిక హై స్కూల్ క్రీడా మైదానంలో గురువా రం నిర్వహించిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సొంత ఖర్చుతోస్వయంగా సైకిళ్లు పంపిణీ చేశారు. అనం తరం వారితో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహం, సందడి వా తావరణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. నినాదాలు, చప్పట్లు, హర్షధ్వానాలతో ప్రాంగణం మార్మోగిపోయింది.

పాదయాత్రలో పుట్టిన సంకల్పం

ప్రజాసంగ్రామ యాత్రలో పేద పిల్లల పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాను. ఓ చిన్నా రి ‘సైకిల్ లేక స్కూల్కి వెళ్లలేకపోతున్నా’ అన్న మాట ఇప్పటికీ నా మనసును కలచివేస్తోం ది. అదే ఈ సైకిల్ పంపిణీ ఆలోచనకు బీజం అని బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్ర మం ప్రభుత్వ నిధులతో కాదని, కార్పొరేట్ సీఎస్‌ఆర్, దాతల విరాళాలతో చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో 20 వేలకుపైగా సైకిళ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.

మొదట ఈ ప్రాంతాల్లో పూర్తి చేసి, తరువాత మరిన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని తెలిపారు.విద్యకు పట్టం కట్టిన మోదీ ప్రభుత్వంవిద్యారంగ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడిందని ఉన్నారు . 2014 లో రూ.68 వేల కోట్లు కేటాయించగా, 202 526 బడ్జెట్లో రూ.1.28 లక్షల కోట్లకు పెంచినట్టు వివరించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ని బద్ధతకు నిదర్శనమని, సమగ్ర శిక్షా అభియాన్, బేటీ బచావో, నవోదయ, ఏకలవ్య, సైనిక్ స్కూళ్ల స్థాపనతో విద్య రంగం అభివృద్ధి చెందిందన్నారు.

త్వరలో మోదీ కిట్స్ పంపిణీఎల్కేజీ నుండి ఆరో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మోదీ కిట్స్ పంపి ణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్, పెన్సిల్స్, వాటర్ బాటిల్, రబ్బర్ తదితర విద్యా సామాగ్రి ఉంటుందన్నారు.అంబేద్కర్, మో దీ జీవితాలే ప్రేరణగా ఉండాలి.పిల్లలు అంబేద్కర్, మోదీ వంటి మహానుభావుల జీవితా లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించా రు.

పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యం మీద దృ ష్టితో ముందుకెళ్తే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరగలరన్నారు.పేదరికం అడ్డంకి కాదు, చదువు బలం మీ భవిష్యత్తు మార్గాన్ని తీర్చి దిద్దుతుంది అని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.హుజురాబాద్ పట్టణ అ ధ్యక్షుడు తూర్పాటి రాజు, మాజీ కౌన్సిలర్లు పైల వెంకటరెడ్డి,నల్లసుమన్ తో పాటు తదితరులుపాల్గొన్నారు.