18-07-2025 12:18:56 AM
పూర్వ విద్యార్థికి విజన్ స్కూల్ యాజమాన్య ఘన సన్మానం
వెంకటాపురం నూగూరు, జూలై 17 (విజయ క్రాంతి): మండల కేంద్రానికి చెందిన బచ్చు. పూర్ణచందర్రావు కొడుకు అయిన రాహుల్ గౌతమ్ సి ఎ చార్టర్ అకౌంట్స్ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం పట్ల విజన్ స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఈ మేరకు పాఠశాల పూర్వ విద్యార్థి అయిన బచ్చు రాహుల్ గౌతమ్ చార్టెడ్ అకౌంటెంట్ ను పూర్తి చేసినం దుకు వెంకటాపురం ఎస్‌ఐ కొప్పుల తిరుపతిరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు..అత్యంత క్లిష్టమైన సీఏ చార్జర్ అకౌంట్ పరీక్షలో మన్యం నుంచి మొదటి ప్రయత్నం లోనే ఉత్తీర్ణత అయి, మన్యానికే వెలుగు తెచ్చాడని, రాహుల్ ని చూసి ఇంకా చాలామంది సీఏ ఎగ్జామ్ కి చదవడానికి స్ఫూర్తి కల్పించాడని కొనియాడారు.
ఇండియాలోనే సివిల్స్ తర్వాత అత్యంత కఠినమైన సీఏ ఫైనల్స్ ఎగ్జామ్స్ మొదటిసారిలోనే ఉత్తీర్ణత అయినందుకు ఈ సందర్భంగా రాహుల్ ను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాహు బాలేంద్రుని రామారావు, రాహుల్ తల్లిదండ్రులు బచ్చు పూర్ణచంద్రరావు- ప్రియాంక, రవిచందర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.