calender_icon.png 18 July, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక రంగాన్ని శాసించే స్థాయికి మహిళలు ఎదగాలి

18-07-2025 12:21:40 AM

జనగామ, జులై 17 (విజయక్రాంతి): గురువారం జనగామ పట్టణంలోని ఓం సాయి గార్డెన్స్ లో ఇందిర మహిళ శక్తి సంఘాల సంబరాలు వేడుకల కార్యక్రమం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆర్.టి.ఐ. సభ్యులు అభి గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ,అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని కేక్ ను కట్ చేసి మహిళలకు స్ఫూర్తి ఇచ్చారు.

ఈ సందర్భంగా మహిళ సంఘాలు పలు వ్యాపార రంగాలలో ప్రావీణ్యత సాధిస్తూ అభివృద్ధి పథంలో సాధికారత దిశగా దూసుకుపోతున్న నేపద్యాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ...రానున్న రోజుల్లో వ్యాపార రంగాలలో మరింత ప్రావీణ్యత పొంది అభివృద్ధి పై పట్టు సాధిస్తూ...ఆర్ధిక రంగాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు.   మహిళలకు ఇందిర మహిళ క్యాంటీన్ లు కలక్టరేట్ లో, జనగామ మున్సిపాలిటీ లో, పాలకుర్తిలో, బచ్చన్నపేట లో ఏర్పాటు చేయగా విజయవంతం గా నిర్వహించడం తో అభినందించారు. 

ప్రతి సెంటర్ లో ఆగస్టు 15వ తేదీ లోపు 50 వనిత టే స్టాల్ లను చేపట్టాలన్నారు. పిల్లలను తప్పక చదివించాలని, ఆడపిల్లలను తప్పక చదివించాలని, విద్యతో  రాణిస్తే భవిష్యత్ పై నమ్మకం ఏర్పడుతుందన్నారు. సఖి సెంటర్ ను మహిళలు ఉపయోగించు కోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు డి.ఆర్.డి.ఓ.నూరుద్దీన్, డి.పి.ఎం. నళిని నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.