16 May, 2026 | 2:10 AM

పార్టీలో కష్టపడే వారికి పదవులు

16-05-2026 12:00 AM

తూప్రాన్, మే 15. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ యంజాల కీర్తన విటల్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పై కావలసికొని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ లో కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఇచ్చే పదవులను అనుభవిస్తూ దురాశతో అవాకులు చేవాకులు పేల్చుతూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నిబంధనలను వక్రీకరిస్తున్నారని అన్నారు. దీనిని తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ ఏకతాటిపైకి వచ్చి తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.

కొందరు మీరు ఆ పార్టీ నుండి ఈ పార్టీ నుండి వచ్చి పదవులు పొందుతున్నారని మేమే ముందు నుండి పార్టీకి సేవ చేస్తున్నామని చెప్పడమే తప్ప ఏ కోశానా పార్టీకి ఏ పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయడం లేదని అన్నారు. ఇందులో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మమిళ్ళ కృష్ణ, నాచారం ట్రస్ట్ చైర్మన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా, కాంగ్రెస్ కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.