పదవులు బాధ్యతలను పెంచుతాయి
22-05-2026 12:42 AM
ఎంపీ ఎం.అనిల్‌కుమార్ యాదవ్
ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): పదవులు బాధ్యతను పెంచుతాయని రాజ్యసభ సభ్యులు ఎం. అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. బాగ్ లింగంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులలైన నవీన్ నాయక్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బుధవారం నవీన్ నాయక్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ నాయక్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తనకు పదవిని ఇచ్చినందుకు రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






