31 August, 2026 | 10:35 AM

Breaking News

నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •  

ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య

31-08-2026 10:03 AM

ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం బాధ్యులు

(కూసుమంచి, విజయక్రాంతి): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారం సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కూసుమంచి మండల ఇన్చార్జ్ పులిపాటి వెంకన్న మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీలు ఎన్నుకోవడం జరిగింది.   ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా జీళ్ళచెరువు గ్రామానికి చెందిన పొట్ట పెంజర పుల్లయ్య మాదిగని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

అలాగే ఎంఎస్పి కూసుమంచి మండల అధ్యక్షులుగా తుడుం నాగరాజు మాదిగని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఖమ్మం జిల్లా ఇన్చార్జి కందిగంట్ల విజయ్ మాదిగ, ఖమ్మం జిల్లా ఎంఎసీపి మాజీ అధ్యక్షులు తురుగంటి అంజన్న మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ నాపై బాధ్యత ఉంచి నాకు అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘం పెద్దలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎంఆర్పీఎస్ బలోపేతం కోసం కృషి చేస్తానని, అందరు సహాకరించాలని కోరారు.