calender_icon.png 31 May, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ అవార్డుల ప్రకటన: బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా 'కల్కి'

29-05-2025 11:25:20 AM

  1. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రకటించిన జయసుధ
  2. కల్కి చిత్రానికి 2024 ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు
  3. 2024 సంవత్సరానికి గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం.. 
  4. బెస్ట్‌ హీరో - అల్లు అర్జున్‌ (పుష్ప-2)
  5. రెండో బెస్ట్‌ ఫిల్మ్‌-పొట్టేల్‌ కు అవార్డు, 
  6. మూడో బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకున్న లక్కీ భాస్కర్‌

హైదరాబాద్: తెలుగు సినిమాకు(Telugu cinema) చేసిన అత్యుత్తమ సేవలను గౌరవించేందుకు ఏర్పాటు చేసిన 2024 సంవత్సరానికి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డుల(Gaddar Telangana Film Awards) విజేతలను తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ సంవత్సరం ఈ అవార్డులలో అగ్రస్థానంలో ప్రభాస్ హీరోగా నటించిన నాగ్ అశ్విన్ "కల్కి 2898 AD"(Kalki 2898 AD) నిలిచింది. దీనికి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఉత్తమ దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు.

గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ గురువారం మీడియా సమావేశంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ ఛైర్మన్ జయసుధ(Jury Chairman Jayasudha) ప్రకటించారు. అవార్డుల ప్రకటనలో టీజీ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు(TFDC Chairman Dil Raju) పాల్గొన్నారు. ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులను ప్రకటించారు. 14 ఏళ్లకు చెందిన అవార్డులను జ్యూరీ ఛైర్మన్ జయసుధ ప్రకటించారు. 11 కేటగిరీలలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 కాలానికి అవార్డులను ప్రకటించారు. ప్రతి ఏడాది ఒక్కో ఉత్తమ చిత్రానికి గద్దర్ అవార్డు దక్కనుంది. జ్యూరీ ఛైర్మన్ జయసుధ మాట్లాడుతూ...  గద్దర్ అవార్డులకు ఎంపికలో తెలంగాణ ప్రభుత్వం జ్యూరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. మాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎంపిక చేశామని జయసుధ వెల్లడించారు.

తెలుగు సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రదానం చేసిన తెలంగాణ ప్రభుత్వం

కల్కి చిత్రానికి 2024 సంవత్సరం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్-2024

2024 - సెకెండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు- పొట్టేల్

2024- థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు- లక్కీ భాస్కర్

2024 ఉత్తమ బాలల చిత్రం- 35 చిన్న కథకాదు

 రజాకార్ చిత్రానికి బెస్ట్ ఎన్విరాన్ మెంట్- ఫీచర్ హెరిటేజ్- హిస్టరీ విభాగంలో అవార్డు

బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరక్టర్-యధువంశీ(కమిటీ కుర్రాళ్లు)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం- ఐఅండ్ మై ఫ్రెండ్స్

నాగ్ అశ్విన్ కు ఉత్తమ డైరెక్టర్- (కల్కి) అవార్డు

ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప-2) అవార్డు

ఉత్తమ నటి- నివేదా థామస్(35 చిన్న కథకాదు) అవార్డు

ఉత్తమ సహాయ నటుడు- ఎస్ జే సూర్య( సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి- శరణ్య  ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ్ సంగీత దర్శకుడు బీమ్స్( రజాకార్)

ఉత్తమ నేపథ్య గాయకుడు- సిధ్ శ్రీరామ్

ఉత్తమ నేపథ్య గాయని- శ్రేయా ఘోషల్

ఉత్తమ హాస్యనటుడు- సత్య,వెన్నెల కిశోర్(మత్తువదలరా-2).