2 July, 2026 | 12:10 AM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

డ్రగ్స్‌కు నో చెప్పండి: ప్రభాస్

31-12-2024 04:33 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే అనర్థాలను వీడియోలో వివరించారు. . జీవితంలో కావల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉందని ప్రభాస్ పేర్కొన్నాడు. మనల్ని ప్రేమించే, మనకోసం బతికేవాళ్లు మనకున్నారని, జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..? ఆయన ఉద్ఘాటించారు. డ్రగ్స్‌కు నో చెప్పాలని అందరినీ ప్రోత్సహించాడు. మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 87126 71111 నంబర్ కు కాల్ చేసి చెప్పాలని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.