1 July, 2026 | 5:11 AM

లంకతో సఫారీల ఢీ

03-06-2024 01:47 AM

న్యూయార్క్: ప్రపంచ చాంపియన్ ట్యాగ్ కోసం దశాబ్దాలుగా చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. టీ20 ప్రపంచకప్ బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. గ్రూప్ భాగంగా సోమవారం శ్రీలంకతో సఫారీ టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. స్టార్ ప్లేయర్లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికాను లంక ఏమాత్రం నిలవరించగలదో చూడాలి. ఇటీవల ఐపీఎల్లో దంచికొట్టిన హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్‌తో పాటు క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, రిజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో నోర్జే, రబడ, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ శంసీ కీలకం కానున్నారు. వణిండు హసరంగ సారథ్యంలో బరిలోకి దిగనున్న లంక జట్టులోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. చరిత అసలంక, కుషాల్ మెండిస్, నిషాంక, షనక, ధనంజయ డిసిల్వతో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సమష్టిగా సత్తాచాటాలని లంక యాజమాన్యం కోరుకుంటోంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. ఉదయాన్నే ఆరు గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో నమీబియాతో ఒమాన్ తలపడనుంది.

వరల్డ్ కప్‌లో నేటి మ్యాచ్‌లు

నమీబియా x ఒమాన్

బ్రిడ్జ్‌టౌన్    ఉ.6.00

శ్రీలంక x దక్షిణాఫ్రికా

న్యూయార్క్     రా.8.00