2 May, 2026 | 3:52 PM

మంథని లో కొనసాగుతున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక

10-03-2026 04:55 PM

దగ్గరుండి పట్టణంలో పనులు చేస్తున్న మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): మంత్రి పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉధృతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమములో భాగంగా మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్  ఆధ్వర్యములో  మంగళవారం మంథని మున్సిపల్  పరిధిలోని 3 వార్డు అంబేద్కర్ నగర్,  కాలేజీ గ్రౌండ్ లో స్పెషల్  సానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. చైర్మన్ దగ్గర ఉండి ఈ కార్యక్రమములో మురికి కాలువలను, రోడ్లను, ముళ్ల పొదలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్  ముస్కుల సహేందర్ రెడ్డి, కుర్ర లింగయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.