2 July, 2026 | 2:16 PM

Breaking News

తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •   మటన్‌లో గోమాంసం.. ఇద్దరు అరెస్ట్   •  

కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్

02-07-2026 01:34 PM

బోడుప్పల్‌లో భూ పోరాటం.. కవిత అరెస్ట్ 

హైదరాబాద్: ఉద్యమకారుల రక్తాన్ని కళ్లజూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని టీఆర్ఎస్ అధినేత్రి కవిత హెచ్చరించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని పేర్కొన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ల సమస్యలు ఇప్పుడు కనిపించడం లేదా? అని కవిత ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామన్న కవిత ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.