ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల సభ
ఎర్రుపాలెం ఏప్రిల్ 16 ( విజయక్రాంతి ): ఎర్రుపాలెం మండల కేంద్రంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమని, గ్రామాభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎర్రుపాలెం రైతు వేదిక వద్ద ఎర్రుపాలెం ఎంపీడీఓ సురేంద్ర కుమార్ అధ్యక్షతన మండల స్థాయి ప్రత్యేక సభ నిర్వహించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ భద్రాచలం దేవస్థానం చైర్మన్ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, మండల ప్రత్యేక అధికారి విజయ చందర్ మండల స్థాయి అధికారులు , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , వివిధ గ్రామాల సర్పంచులు, ఎర్రుపాలెం గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని, ఎర్రుపాలెం పంచాయతీ కార్యదర్శి జి ఏలేశ్వరావు, వివిధ గ్రామాల కార్యదర్శిలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






