17 April, 2026 | 3:22 AM

రేషన్ బియ్యం స్వాధీనం

17-04-2026 12:00 AM

ఎల్బీనగర్ ప్రాంతంలో సివిల్ సప్లై అధికారులు దాడి 

సుమారు 200 క్వింటాళ్ల బియ్యం పట్టివేత 

ఎల్బీనగర్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): ఎల్బీనగర్ ప్రాంతంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసిన ప్రదేశాన్ని స్థానికులు మాటు వేసి పట్టుకున్న ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.  సుమారు 23 వేల కిలోల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లింగోజిగూడ డివిజన్ పరిధిలోని తపోవన్ కాలనీలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డికి సమాచారం రావడంతో ఆయన రంగారెడ్డి కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు డీఎస్‌ఓ వనజాత, ఏఎస్‌ఓతోపాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ మేరకు గురువారం ఉదయం సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి గోదాంపై దాడి చేసి నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సివిల్ సప్లై ఏఎస్‌ఓ పుల్లయ్య, సరూర్ నగర్ ఎస్త్స్ర మారయ్య సమక్షంలో మొత్తం బియ్యాన్ని రావిరాలలోని సివిల్ సప్లై కార్యాలయానికి తరలించారు. తనిఖీల్లో సుమారు 23 వేల కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తున్న ప్పటికీ కొంతమంది రేషన్ షాప్ నిర్వాహకులు తక్కువ ధరకు తీసుకుని అధిక ధరలకు ఇతర రాష్ట్రాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారని అధికారులు వెంటనే  అవినీతికి పాల్పడుతున్న రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందికంటి శ్రీధర్‌గౌడ్, మనోజ్ కుమార్, గోవర్ధన్, గౌస్, జూపల్లి ప్రవీణ్, రాజు వెంకట్, శ్రీనాథ్, శివగౌడ్‌పాల్గొన్నారు.